బ్యాంకు నిర్లక్ష్యానికి వృద్ధ రైతుకు పరిహారం చెల్లించాలంటూ ఆదేశం
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
భార్య మరణాంతరం ఆమె ఖాతాలోని నగదును ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేసిన బ్యాంకుపై వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. ఇంగ్లీష్ రాదనే కారణంతో వృద్ధ రైతును పదేపదే తిప్పించుకుని మానసిక క్షోభకు గురిచేసినందుకు బ్యాంకు రూ.10,000 పరిహారంతో పాటు రూ.5,000 న్యాయ ఖర్చులు చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది. నామినీ మరణించిన తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సమర్పించినప్పటికీ అనవసర నిబంధనల పేరుతో నిధులు నిలిపివేయడంపై కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది.