ఉత్తరప్రదేశ్‌లో మరో చిరుత పట్టివేత, భయాందోళనలో ప్రజలు

రిపోర్టర్: సురేష్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లా ఠాకూర్‌ద్వార ప్రాంతంలో చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు మరో ప్రమాదకరమైన చిరుతను విజయవంతంగా బోనులో బంధించారు. ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు పట్టుకున్న చిరుతల్లో ఇది 14వది కావడం గమనాఆర్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.