జగిత్యాలలో సైబర్ భద్రత పోస్టర్లు ఆవిష్కరణ: నేరాలపై ఎస్పీ సమీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: జగిత్యాల
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం అక్టోబర్ 2026 సందర్భంగా ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించినట్లు జగిత్యాల ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో సైబర్ నేరాల దర్యాప్తు, కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు వెంటనే డయల్ 1930 లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసి తగిన సహాయం పొందాలని ఆయన స్పష్టం చేశారు.