మణిపూర్‌లో ఉద్రిక్తత, కుకి మిలిటెంట్ల జరిపిన దాడిలో నాగ బాలుడు మృతి

రిపోర్టర్: శివ స్థలం: మణిపూర్

మణిపూర్ రాష్ట్రంలోని తమేంగ్‌లాంగ్ జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ఎన్‌కే విఫెన్‌బౌ అనే 17 ఏళ్ల నాగా కమ్యూనిటీకి చెందిన బాలుడు కుకి మిలిటెంట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. నిత్యావసర సరుకుల కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మాజీ సీఎం ఎన్ బీరెన్ సింగ్, ఎమ్మెల్యే అవాంగ్‌బో న్యూమై ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.