హైదరాబాద్లో విషాదం: సెల్ ఫోన్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇరవై ఏళ్ల హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సార్ నగర్ పోలీసులు వెల్లడించారు. లెక్చరర్ కృత్రిమ మేధస్సుతో కూడిన మార్ఫ్ చిత్రం తయారు చేశాడనే ఆరోపణలతో ఫోన్ తీసుకుని ప్రిన్సిపాల్కు అప్పగించారు. క్షమాపణ చెప్పినా వారం రోజులపాటు ఫోన్ ఇవ్వకపోవడంతో తీవ్ర అవమానంగా భావించి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.