మఠంపల్లిలో తహసీల్దార్ కార్యాలయ భవన తరలింపుపై వ్యతిరేకత
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సూర్యాపేట జిల్లా
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు కాగా.. కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తుండటంపై స్థానికులు, అఖిలపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో సౌలభ్యంగా ఉందని, కార్యాలయాన్ని దూర ప్రాంతానికి మళ్లీస్తే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రయాణ భారం తప్పదని వారు వాపోతున్నారు. ప్రస్తుత స్థలంలోనే భవనాన్ని నిర్మించాలని లేదంటే అధికారుల స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.