పేదలకు తీపి కబురు: హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మించనున్న ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ పరిధిలో పేద కుటుంబాల కోసం మూడు విడతలుగా లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. నగరంలో సొంతిల్లు లేని అర్హులైన నిరుపేదలకు పారదర్శక విధానంలో ఇవి అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.