సంక్షేమ పథకాలకు ఆధార్ రేషన్ కార్డులే నివాస ధృవీకరణ పత్రాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు మరియు ప్రయోజనాల కోసం ఆధార్, రేషన్ కార్డులను నివాస ధృవీకరణ పత్రంగా పరిగణించాలని ఆదేశించింది. సీఎస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఈ మేరకు సవరించిన ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అవసరాలు, సైనిక నియామకాలు మినహా ఇతర రాష్ట్ర స్థాయి ప్రయోజనాల కోసం తహశీల్దార్ల నుంచి భౌతిక నివాస ధృవీకరణ పత్రాలు పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.