పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా నరుకూరులో మొక్కలు నాటిన రాజగోపాల్ రెడ్డి
రిపోర్టర్: sujith reddy
స్థలం: తోటపల్లిగూడూరు
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెండు వందల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భావితరాలకు మనం ఇచ్చే నిజమైన సంపద మొక్కలు, చెట్లే అని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని, అధికారుల స్పందన మెరుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు.