నగరంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు: చలిగాలులతో వణికిపోతున్న పలు ప్రాంతాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
నగరంలో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని తెలంగాణ వెదర్మ్యాన్ (Telangana Weatherman - T. Balaji) వెల్లడించారు. మైలార్దేవ్పల్లి మొయినాబాద్లో పద్దెనిమిది దశ తొమ్మిది డిగ్రీలు, హెచ్సీయూ సెర్లింగంపల్లిలో పంతొమ్మిది దశ ఒక డిగ్రీ, రాజేంద్రనగర్లో ఇరవై దశ మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఉదయం కల్లా కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పదిహేడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని, ఈ సీజన్లో ఇదే తొలి చలి ప్రభావం అని తెలిపారు.