భూమి అంతర్భాగంలో అపారమైన నీటి నిల్వలు గుర్తింపు

రిపోర్టర్: మహేష్ స్థలం: World

భూమి ఉపరితలం కింద వేల కిలోమీటర్ల లోతున అపారమైన నీటి నిల్వలు దాగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు సంచలనాత్మక విషయాన్ని కనుగొన్నారు. మాంటిల్, కోర్ పొరల మధ్య దాదాపు 660 నుండి 2,900 కిలోమీటర్ల లోతున ఈ నీటి ఉనికిని గుర్తించారు. ఈ అంతర్భాగ నీటి పరిమాణం పసిఫిక్ సముద్రం కంటే రెట్టింపు స్థాయిలో ఉండవచ్చని సైన్స్ జర్నల్ నేచర్ జియోసైన్స్ ప్రచురించిన అధ్యయనం స్పష్టం చేసింది.