మేడ్చల్ మల్కాజిగిరిలో పదవీ విరమణ పొందిన అధికారులకు వీడ్కోలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ వెల్లడించారు. 2026 సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల సేవలను ఉన్నతాధికారులు కొనియాడారు. వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షిస్తూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.