ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరింది. మంచిర్యాలలో జరిగిన సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఓటు చోర్ గద్దె చోడ్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.