ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న మూడు గంటల వ్యవధిలో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, భీమిలి, శృంగవరపుకోట, జామి, కొత్తవలస, వేపాడ, అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.