కారు కొనేవారికి గుడ్ న్యూస్: అక్టోబర్లో ఐదు కొత్త ఫేస్లిఫ్ట్ కార్ల విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అక్టోబర్ నెలలో పలు కొత్త మోడళ్లు విడుదల కానున్నట్లు ఆటోమొబైల్ నిపుణులు వెల్లడించారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థల నుంచి మొత్తం ఐదు కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ కార్లు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిపారు. మెర్సిడెస్, హోండా, స్కోడా, టయోటా, వోక్స్వ్యాగన్ బ్రాండ్ల నుంచి సరికొత్త ఫీచర్లు, అప్గ్రేడ్ చేసిన డిజైన్లతో ఈ వాహనాలు లాంచ్ కానున్నాయని వారు పేర్కొన్నారు.