సినిమా ప్రియులకు గుడ్ న్యూస్: మరోసారి థియేటర్లలోకి కమల్ హాసన్ దశావతారం
రిపోర్టర్: సురేష్
స్థలం: చెన్నై
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అద్భుత సృష్టిగా నిలిచిన విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సంచలన చిత్రం దశావతారం మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. సుదీక్ష ఎంటర్టైన్మెంట్ ద్వారా నవంబర్ 28న ఈ చిత్రం గ్రాండ్ రీ-రిలీజ్ కానుందని నిర్వాహకులు తెలిపారు. పది విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ చిత్రం అభిమానులకు గొప్ప కానుకగా నిలుస్తుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.