నెల్లూరులో మందకొడిగా మున్సిపల్ పోలింగ్: ఓటు వేయడానికి ఆసక్తి చూపని విద్యావంతులు
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగర ప్రజలు ఓటు విషయంలో మరోసారి నిర్లక్ష్యం చూపారని, గతంతో పోలిస్తే కొంచెం పెరిగినా ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. విద్యావంతులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఓటు వేయడానికి ముందుకు రాలేదని, వృద్ధులు మాత్రమే ఉత్సాహం చూపగా యువత ఇంటికే పరిమితమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. డివిజన్ల పునర్విభజన వల్ల కేంద్రాలు మారడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.