అమెరికాలో ముందస్తు ఓటింగ్ కలకలం: ట్రంప్ పార్టీకి భారీ షాక్

రిపోర్టర్: మహేష్ స్థలం: అమెరికా

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ముందస్తు ఓటింగ్ ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ఎలక్షన్ ల్యాబ్ గణాంకాల ప్రకారం దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఓటర్లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. నమోదైన ఓట్లలో డెమోక్రాట్ల వైపు నూట నలభై ఐదు శాతం మంది మొగ్గు చూపగా రిపబ్లికన్ల వైపు తక్కువగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.