థాయిలాండ్లో భారీ వర్షాల బీభత్సం: పర్యాటకులకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
రిపోర్టర్: గోపి
స్థలం: బాంకాక్
థాయిలాండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని థాయ్ వాతావరణ శాఖ హెచ్చరించిందని అధికారులు తెలిపారు. అక్టోబర్ ఆరు నుంచి పన్నెండు వరకు దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు రాజధాని బాంకాక్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.