పెనుగొండ గొల్లపల్లి జలాశయంలో విషాదం: ఐదుగురు మహిళలు దుర్మరణం

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్లి జలాశయంలో స్నానానికి దిగి ఐదుగురు మహిళలు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. విహారయాత్ర కోసం జలాశయం వద్దకు వెళ్లిన కుటుంబంలోని అశ్విని, గాయత్రి, పుష్ప, మణిన్, హాసిన్ నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.