బాలీవుడ్ లో ప్రాంతీయ వివక్షను ఎండగట్టిన నటి రెజీనా కసాండ్రా

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

బాలీవుడ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, ప్రాంతీయ వివక్షను ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తీవ్రంగా బయటపెట్టారు. కేసరి చాప్టర్ 2 చిత్రంలో నటించినప్పటికీ ప్రమోషన్లలో తన పేరును తొలగించారని, సౌత్ ఇండియన్ నటి అనే కారణంతోనే తనపై ఇలాంటి వివక్ష చూపించారా అంటూ ఆమె బాలీవుడ్ తీరును నిలదీశారు. ఉత్తరాది నటులు దక్షిణాది సినిమాలపై బహిరంగంగా విమర్శలు చేయడం వల్ల అనవసరమైన విభేదాలు వస్తాయని రెజీనా ఆవేదన వ్యక్తం చేశారు.