సొంత భవనానికి నోచుకోని ఎస్పీబాలు సంగీత పాఠశాల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరులోని డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ఐదు దశాబ్దాలుగా సొంత భవనం లేక అద్దె భవనంలోనే కొనసాగుతోందని ప్రిన్సిపల్ మునికుమార్ తెలిపారు. ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన ఈ సంస్థకు ఇప్పటివరకు నాలుగుసార్లు అద్దె భవనాలు మార్చాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సొంత భవన ప్రతిపాదనలు పంపుతున్నామని, కళాశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సంగీతాభిమానులు కోరుతున్నారు.