అమెరికాలో డిసెంబర్ లో ప్రధాని మోడీ కీలక పర్యటన

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమెరికా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు మోడీ అమెరికా వెళ్లనుండగా, ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలతో పాటు క్వాడ్ దేశాల సమావేశం జరిగే అవకాశం ఉంది. అలాగే అమెరికా పర్యటన ముగిసిన అనంతరం కెనడాలో కూడా ఆయన పర్యటించే సూచనలున్నాయి.