ఏపీలో 1,600 మెగావాట్ల చౌక విద్యుత్ కొనుగోలుకు నిర్ణయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్రంలో ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన శాఖ పకడ్బందీ రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. భవిష్యత్ అవసరాల కోసం టారిఫ్ ఆధారిత బిడ్డింగ్ ద్వారా 1,600 మెగావాట్ల చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. సెప్టెంబర్‌లో గరిష్ఠ డిమాండ్ 14,150 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని, ఏపరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు గ్రిడ్‌ను సంసిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.