వాహనదారులకు భారీ షాక్: రెండు ప్రముఖ కార్ల ధరలను పెంచిన ఎంజీ మోటార్స్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా తన రెండు ప్రముఖ కార్ల ధరలను పెంచుతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. విండ్సర్ ఈవీ ధరను పదిహేను వేల రూపాయలు, మెజెస్టర్ ఎస్యూవీ ధరను లక్ష రూపాయల వరకు పెంచింది. పెంచిన ఈ కొత్త ధరలు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.