డైరెక్టర్ పవన్ సాదినేనికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

సినీ ఇండస్ట్రీకి చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అరెస్టయిన దర్శకుడు పవన్ సాదినేనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి మోసం చేశారని బాధితురాలు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బెయిల్ లభించినప్పటికీ, ఆయనపై నమోదైన కేసులో దర్యాప్తు మరియు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.