సంబరాల ఏటి గట్టు షూటింగ్ పూర్తి: సంక్రాంతికి సినిమా విడుదల

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం సంబరాల ఏటి గట్టు షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పదికి పైగా షెడ్యూల్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు.