పూణెలో గణేశోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: Pune
పూణెలో తొలిసారిగా గణేశోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కూడా కావడంతో ఈ వేడుకల ప్రాధాన్యత మరింత సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.