'మోసాలను అడ్డుకుంటాం': ఐఓఎస్ 27లో కొత్త భద్రతా ఫీచర్‌ను తెచ్చిన యాపిల్
రిపోర్టర్: నరేష్
స్థలం: World
ప్రస్తుతం పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ కొత్త ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌లో అత్యాధునిక భద్రతా ఫీచర్‌ను పరిచయం చేసింది. ఐఫోన్ యూజర్లను సోషల్ ఇంజనీరింగ్ మోసాలు, నకిలీ బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీల దగా నుంచి రక్షించేందుకు 'ఇంపర్సనేషన్ రిస్క్ డిటెక్షన్' అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఎవరైనా యూజర్లు చెల్లింపులు చేసే సమయంలో లేదా అత్యంత సున్నితమైన ఖాతా వివరాలను మార్చే తరుణంలో ఈ ఫీచర్ అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టి హెచ్చరికలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది.