అమెరికాలో షాకింగ్ ఘటన: ఉరిశిక్ష వికటించడంతో ఆస్పత్రిపాలైన మహిళా ఖైదీ

రిపోర్టర్: సతీష్ స్థలం: Tennessee

అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో క్రిస్టా పైక్ అనే మహిళా ఖైదీకి విధించిన మరణశిక్ష వికటించిందని, రెండుసార్లు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చినప్పటికీ ఆమె ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు న్యాయవాదులు వెల్లడించారు. ఈ అసాధారణ ఘటనపై టెన్నెస్సీ గవర్నర్ బిల్ లీ తీవ్ర విచారణకు ఆదేశించడంతో పాటు, ఈ ఏడాది చివరి వరకు రాష్ట్రంలో జరగాల్సిన అన్ని మరణశిక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారని అధికారులు పేర్కొన్నారు.