పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరుగుతోందని సీఎం చంద్రబాబు వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఇవాళ 26,401 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవాళ్లు ఆనందంగా ఉండటమే నిజమైన అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు.