25 వేల ఏళ్ల కిందటే మానవులు మత్తు పదార్థాలు వాడారు!
రిపోర్టర్: సతీష్
స్థలం: World
ఇండోనేషియాలో 25 వేల సంవత్సరాల క్రితమే మానవులు పోక చెక్కలు లేదా సుపారీని మత్తు పదార్థంగా వాడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సులవేసి ద్వీపంలో లభించిన ప్రాచీన మానవ అస్థిపంజరాల దంతాలపై జరిపిన అధ్యయనంలో ఈ సంచలన విషయం వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన డ్రగ్స్ వాడకపు సాక్ష్యంగా పరిశోధకులు భావిస్తున్నారు.