కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం చూస్తున్నారా: ప్రత్యామ్నాయ మార్గాలివేనంటూ ఆయిల్ కంపెనీలు వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల జారీపై ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులు స్పష్టం చేశారు. సాధారణ కనెక్షన్లకు బదులుగా ఐదు లేదా పది కేజీల చిన్న సైజు సిలిండర్లను సులభంగా పొందవచ్చని తెలిపారు. అలాగే నగరాల్లో నివసించే ప్రజలు పైప్లైన్ ద్వారా సహజ వాయువును అందించే పీఎన్జీ కనెక్షన్లను కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.