సూర్యతో సినిమా అవకాశాల తిరస్కరణపై స్పందించిన నటి నజ్రియా ఫహాద్

రిపోర్టర్: రాజేష్ స్థలం: కేరళ

సూర్యతో గతంలో వచ్చిన మూడు సినిమాల అవకాశాలను తాను కావాలని వదులుకోలేదని, కేవలం డేట్లు కుదరకపోవడం వల్లే వాటిని చేయలేకపోయానని హీరోయిన్ నజ్రియా ఫహాద్ స్పష్టం చేశారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన సీన్ సినిమాతో దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ తమిళ పరిశ్రమలోకి పునరాగమనం చేస్తున్నారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నజ్రియా మాట్లాడుతూ, సరైన కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశానని వెల్లడించారు.