స్థానిక సంస్థల ఎన్నికలు: నాలుగు పట్టణాల్లో నామినేషన్ల గడువు పొడిగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సవరించిన షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మైదుకూరుతో పాటు మరో మూడు స్థానిక సంస్థల్లోని డెబ్బై రెండు వార్డులకు నామినేషన్ల స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల ఇరవై మూడు, ఇరవై నాలుగు తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.