శిక్షణ నైపుణ్యాలను ప్రజా సేవలో వినియోగించాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

శిక్షణ కాలంలో నేర్చుకున్న ప్రతి నైపుణ్యాన్ని ప్రజా సేవలో సమర్థవంతంగా వినియోగించాలని నూతన పోలీస్ కానిస్టేబుళ్లకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్ఎస్లో అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి బాధ్యతగా పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.