వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం: పది రోజుల బాలుడికి విజయవంతంగా కాలేయ మార్పిడి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Mumbai

తీవ్రమైన కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న చిన్నారికి ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి నిర్వహించినట్లు వైద్య బృందం వెల్లడించింది. బాలుడి తల్లి తన కాలేయంలో కొంతభాగాన్ని దానం చేయగా, వైద్యులు అత్యంత క్లిష్టమైన పది గంటల శస్త్రచికిత్సను పూర్తి చేశారు. పోస్ట్-ఆపరేటివ్ దశలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, బాలుడు పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకున్నాడని నిపుణులు తెలిపారు.