తెలంగాణ రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ప్రశంసించిన టర్కీ ప్రతినిధులు
రిపోర్టర్: రమేష్
స్థలం: హనుమకొండ
తెలంగాణలో రెసిడెన్షియల్ విద్యా విధానం, కస్తూర్బా పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య బాగుందని టర్కీ దేశ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం కస్తూర్బా పాఠశాలను శుక్రవారం టర్కీ విద్య, ఉపాధ్యాయ సంస్థల ప్రతినిధులు మసూద్, నూరుల్లాఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై అధ్యయనం చేసి, తమ దేశంలోనూ దీనిని అమలు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.