రూ.25 కోట్ల ఆస్తికోసమే జగదీశ్వరరెడ్డిని హత్య చేశా: సాధిక్‌ఖాన్
రిపోర్టర్: మహేష్
స్థలం: కాకినాడ
కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాధిక్‌ఖాన్ సంచలన విషయాలు వెల్లడించాడు. సౌజన్యను పెళ్లి చేసుకుంటే రూ.25 కోట్ల ఆస్తి తనదవుతుందనే ఆశతోనే సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆస్తి విషయంలో ఆమె తండ్రి ఒప్పుకోకపోవడంతోనే ఈ దురాఘాతానికి పాల్పడినట్లు స్పష్టం చేశాడు.