పెద్దూరులో విద్యార్థుల చైతన్యానికి నూతన కమిటీతో ఊపిరిపోసిన ఎంఎస్ఎఫ్ నాయకత్వం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామకుప్పం

రామకుప్పం మండలంలోని పెద్దూరు గ్రామంలో మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ చిల్డ్రన్ విభాగం గ్రామ కమిటీని మండల యువసేన అధ్యక్షుడు ఎన్.పలని మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఐక్యత, నాయత్వ లక్షణాలు పెంపొందించడం, విద్యా రంగంలో రాణించేలా ప్రోత్సహించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి విద్యార్థి సంఘ కమిటీలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని నాయకులు వెల్లడించారు.