బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలపై సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ వరుస బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ భారీ సభ నిర్వహించనుండగా, ఆ తర్వాత సిద్దిపేట, గజ్వేల్‌లలోనూ సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు రాజకీయ దాడి పెంచేలా ఈ వ్యూహం సాగుతోంది.