శాసనసభలో శ్రీపాదరావు సెంట్రల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం అసెంబ్లీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులర్పించారు.