బాలీవుడ్ లో కలకలం: ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ పేరుతో బెదిరింపు కాల్

రిపోర్టర్: సునీల్ స్థలం: Mumbai

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ దుండగులు ఫోన్ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో పలువురు నటులకు ఇలాంటి హెచ్చరికలు వస్తుండటంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. ముంబైలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.