మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్లు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ 2029 నాటికి ఇల్లు అందించాలన్న లక్ష్యంతో గృహనిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పీఎంఏవై కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.