షకహోలా మారణకాండ: మతబోధకుడు పాల్ మెకెంజీకి 200 ఏళ్ల జైలు శిక్ష
రిపోర్టర్: వెంకట్
స్థలం: నైరోబి
కెన్యాలో సామూహిక మరణాలకు కారణమైన మతబోధకుడు పాల్ మెకెంజీకి మొంబాసా హైకోర్టు 200 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఆకలితో ఉంటే యేసుక్రీస్తును కలుసుకోవచ్చని నమ్మించి, వందలాది మందితో బలవంతపు ఉపవాస దీక్షలు చేయించి 191 మంది మృతికి కారకుడయ్యాడని కోర్టు స్పష్టం చేసింది. గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి పేరుతో సాగిన ఈ అరాచకంపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిందితుడితో పాటు మరో 28 మందికి కూడా వివిధ శిక్షలు ఖరారు చేసినట్లు వెల్లడైంది.