మంచిర్యాలలో భగ్గుమన్న గడ్డం వంశీ ప్రేమ్ సాగర్ రావు విభేదాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Mancherial

మంచిర్యాల రాజకీయాల్లో గడ్డం వంశీ మరియు ప్రేమ్ సాగర్ రావు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇద్దరు మంత్రుల సమక్షంలోనే గడ్డం వంశీపై ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సహాయం లేకుంటే ఎంపీగా గెలిచేవాడా అంటూ నిలదీశారు. అందరం కలిసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్నే తొక్కేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.