ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం: జోషీమఠ్ సమీపంలో ఆరుగురు దుర్మరణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చమోలీ
ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బదరీనాథ్ ధామం నుంచి డెహ్రాడూన్ బయలుదేరిన ప్రైవేట్ హెలికాప్టర్ జోషీమఠ్ సమీపంలోని ఛాయిన్ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.