భారీ షాక్: ఏపీలో బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టివేసిన హైకోర్టు
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పావు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించారు. సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితికి విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. రాబోయే ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.