అనంతపురం పీటీసీ మైదానంలో కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనంతపురం
అనంతపురం శిక్షణ పూర్తి చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎస్సీటీపీసీ సివిల్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ స్థానిక పీటీసీ మైదానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పయ్యావుల కేశవ్ నూతన కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమైన పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం కనబరచాలని పిలుపునిచ్చారు.