జంగారెడ్డిగూడెం పురపాలక ఎన్నికల కట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: జంగారెడ్డిగూడెం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని ఆర్డీవో రమణ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నామని, రెండు రౌండ్లలో మొత్తం ముప్ పై రెండు వార్డుల లెక్కింపు పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు ఆర్డీవోతో పాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.